ప్రఖ్యాత నటుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ, అభిమానుల శోకసంద్రంలో మునిగిపోయారు.
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1964 లో పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన దాదాపు 345 చిత్రాల్లో నటించారు. 80 సంవత్సరాలు ఉన్న కృష్ణకు తాజాగా ఆదివారం గుండె పోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. 8 మంది వైద్యనిపులు చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు కృష్ణ తుదిశ్వాస విడిచారు. దాంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ తోపాటు సినీ పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి.