సినీ ఇండస్ట్రీలో అభిమాన తారలకు పెళ్లిళ్లు జరిగాయంటే చాలు.. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తుంటారు. ఇక ఎప్పుడైతే ఫేవరేట్ హీరోయిన్ ప్రెగ్నన్సీ అని తెలుస్తుందో.. ఫ్యామిలీ మెంబర్స్ ఏమోగానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషి అయిపోతారు. అదీగాక ఆ హీరోయిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిస్తే.. అది ఖచ్చితంగా అభిమానులకు గుడ్ న్యూసే అవుతుంది.
తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చి అభిమానులతో వార్తను తీపి కబురు షేర్ చేసుకుంది ప్రముఖ బ్రిటిష్ నటి స్కార్లెట్ బైర్న్. భర్త కూపర్ హెఫ్నర్ తో కలిసి స్కార్లెట్.. ఇద్దరు పండంటి బిడ్డలకు(ఆడపిల్లలు) స్వాగతం పలికింది. ఈ విషయాన్నీ ఇంస్టాగ్రామ్ వేదికగా.. పుట్టిన పిల్లలతో పాటు భర్తతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి చెప్పింది. అదేవిధంగా పుట్టిన పిల్లల పేర్లు కూడా అనౌన్స్ చేసింది స్కార్లెట్.
“ఈ వారాంతంలో నా భర్త కూపర్, నేను మా ఇద్దరు కవల పిల్లలు.. మేరిగోల్డ్ అడెలె హెఫ్నర్, బ్లోసమ్ పెర్ల్ హెఫ్నర్ లకు స్వాగతం పలికాము. పిల్లలను చూసి మా హృదయం నిండిపోయింది. మా సంతోషం మరింత రెట్టింపు అయింది. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు కూతుర్లతో కళకళలాడుతోంది. ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాం’ అని స్కార్లెట్ బైర్న్ పోస్టులో తెలిపింది.?
ఇక స్కార్లెట్ గురించి హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యారి పోటర్ సిరీస్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ 32 ఏళ్ళ బ్యూటీ.. 2019లో కూపర్ ని పెళ్లాడింది. వీరికి 2020లో మొదటి కూతురు(బెట్సి రోజ్) జన్మించింది. చివరిగా ‘స్కై బౌండ్’ సినిమాలో లీడ్ చేసిన స్కార్లెట్.. తర్వాత పలు టీవీ సిరీస్ లలో కనిపించింది. మరి స్కార్లెట్ క్యూట్ ఫ్యామిలీ పిక్ ఫై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.