ఈ పిల్ల మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ గా వయ్యారాలు ఒలకబోయగలదు, రింగ్ లో దిగి బాక్సింగ్ చేయగలదు. ఈమె ఫిజిక్ చూస్తే ఎవరైనా సరే కంట్రోల్ తప్పిపోతారు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆ బ్యూటీని చూస్తే గుర్తొచ్చేది కుందనపు బొమ్మ. ఫిజిక్ చూస్తే మాత్రం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతారు. రింగు రింగుల హెయిర్ తో బబ్లీగా భలే ముద్దొచ్చేలా ఉంటుంది. తెలుగు చేసింది రెండే సినిమాలు కానీ క్రేజ్ మాత్రం వేరే లెవల్లో సంపాదించింది. ఇక ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు అందరూ అలెర్ట్ అయిపోతారు. వావ్ వాట్ ఏ బ్యూటీ అని తెగ కామెంట్స్ చేసేస్తారు. టైట్ ఔట్ ఫిట్స్ వేసుకుని కవ్వించే ఈమె బరువైన అందాలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారండోయ్. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో చిన్న పిల్ల ఉంది కదా! ధ్యానం చేస్తూ భలే క్యూట్ గా ఉంది. ఇప్పుడు మాత్రం తన ఒంపుసొంపులతో మత్తెక్కిస్తూనే ఉంది. రియల్ లైఫ్ లో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సర్ అయిన ఈమె పేరు రితికా సింగ్. 2009 ఆసియన్ ఇండోర్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసింది. కెరీర్ లో నాలుగు బౌట్స్ ఆడితే అందులో మూడింటిలో ఓడిపోయి ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించింది. ‘సాలా ఖాదూస్’ అనే సినిమా కోసం బాక్సర్ రితికా సింగ్ ని ఎంపిక చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రితికా పేరు మార్మోగిపోయింది. అలా ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా ‘గురు’ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడా కూడా హిట్ అయింది.
అలా బాక్సర్ కాస్త హీరోయిన్ గా మారిపోయిన రితికా సింగ్.. తమిళంలో లారెన్స్, విజయ్ సేతుపతి లాంటి యాక్టర్స్ తో వర్క్ చేసింది. తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘నీవెవరో’ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అంతే అక్కడ నుంచి తమిళ, మలయాళంలోనే నటిస్తూ బిజీగా మారిపోయింది. 2020లో వచ్చిన తమిళ మూవీ ‘ఓ మై కడవులే’ ఈమె కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. త్వరలో ‘ఇన్ కార్’ అనే సౌత్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ‘చంద్రముఖి 2’లో నటిస్తున్న రితికా.. మరో రెండు తమిళ చిత్రాలతో పాటు దుల్కర్ హీరోగా నటిస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.
సినిమాలతో ఎప్పుడూ ఆడియెన్స్ కు దగ్గరగా ఉండే రితికా సింగ్.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఈమె పెట్టే ఫొటోలు, వీడియోలు చూస్తే మగాడు అనేవాడికి ఎవరికైనా సరే పిచ్చెక్కిపోతుంది. అంత హాట్ గా ఉంటుంది మరి. తాజాగా కూడా జిమ్ లో వర్కౌట్ అయిపోయిన తర్వాత తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిని చూసి కుర్రాళ్లు కంట్రోల్ తప్పిపోతున్నారు. తాజాగా ఆమె చిన్నప్పుడు ధ్యానం చేస్తున్న పిక్ ఒకటి వైరల్ అయింది. అలా రితికా సింగ్ గురించి మరోసారి మాట్లాడుకునే ఛాన్స్ మనకొచ్చింది. ఇంతకీ చిన్నారి ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.