ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా అవకాశం వచ్చుంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్, హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ చేసి అదరగొట్టేసింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా అవకాశం వచ్చుంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్, హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ చేసి అదరగొట్టేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే.. సాయి ధన్సిక. పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘కబాలి’ మూవీలో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురిగా నటించిన అమ్మాయి అంటే ‘ఓ ఆమెనా?’ అనుకుంటారు.
2009 నుంచి తమిళ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ధన్సిక.. గతేడాది ‘షికారు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ ఫిలిం ప్రమోషన్స్ అప్పుడు ‘కామెడీ స్టార్స్ ధమాకా’లో చమ్మక్ చంద్ర స్కిట్లో కనిపించి సర్ప్రైజ్ చేసింది. ధన్సిక తమిళనాడులోని తంజావూరులో పుట్టి పెరిగింది. కథానాయికగానే కాకుండా కథలో ప్రాధాన్యత కలిగిన పాత్రలు కూడా చేసింది. తమిళ్ ఇండస్ట్రీ వాళ్లు, ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా ‘నేచురల్ బ్యూటీ’ అని పిలుస్తుంటారు.
‘మనతోడు మజాయికాలం’ మూవీతో కోలీవుడ్‌కి పరిచయమైంది. డైరెక్టర్ బాలా తీసిన ‘పరదేశి’ నటిగా మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. ‘కెంప’ అనే కన్నడ చిత్రంలో నటించేటప్పుడు తన పేరు తనుషిక (Thanushika) గా మార్చుకుంది. మళయాలంలో మాత్రం ధన్సికగానే కొనసాగింది. ‘షికారు’ తర్వాత తెలుగులో కనిపించలేదు. ప్రస్తుతం తమిళంలో కాస్త గ్యాప్ తీసుకుంది.
ఇది కూడా చదవండి : బాలయ్యతో పాన్ ఇండియా డైరెక్టర్ సూపర్ హీరో సినిమా!