ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయ్. ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసే హీరో-డైరెక్టర్ మూవీ మీద మంచి బజ్ ఏర్పడుతుంది. అలాంటి ఓ సాలిడ్ కాంబో త్వరలో వర్కౌట్ కాబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయ్. ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసే హీరో-డైరెక్టర్ మూవీ మీద మంచి బజ్ ఏర్పడుతుంది. అలాంటి ఓ సాలిడ్ కాంబో త్వరలో వర్కౌట్ కాబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణతో ఓ సూపర్ హీరో పిక్చర్ ప్లాన్ చేయబోతున్నట్లు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన ఆడియో క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ చేస్తున్నారు. టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న భారీ స్థాయిలో విడుదల కానుంది.
తర్వాత ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన యువ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. బాలయ్య డేట్స్ ఇవ్వాలే కానీ కథతో రెడీగా ఉండే దర్శక, నిర్మాతలు చాలా మందే ఉంటారు. అలాగే ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో ఓ సాలిడ్ సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ ఫిలిం ‘అ!’ తో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యపరిచి, ‘కల్కి’, ‘జాంబి రెడ్డి’ వంటి సినిమాలతో అలరించిన ప్రశాంత్ ఇప్పుడు తేజ సజ్జాతో ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో ‘హనుమాన్’ తీస్తున్నారు. 2024 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
కాగా ప్రశాంత్ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షోకి షూట్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. ఆ టైంలోనే బాలయ్యకి బేసిక్ స్టోరీ ఐడియా చెప్పారట. ఆయనకు కూడా నచ్చిందని.. సినిమా తన స్టైల్లో ఉంటూనే.. బాలయ్య నుండి ఆశించే అంశాలు కూడా ఉంటాయని, ఒక కొత్త ప్రపంచంలో కనిపిస్తారని, ఆయన మిగతా కమిట్మెంట్స్ తర్వాత ఇది మెటీరియలైజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ‘హనుమాన్’ టీజర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ, బాలయ్యతో సూపర్ హీరో సినిమా చేయనున్నారనే న్యూస్‌తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
@PrasanthVarma about his film with Balayya 🔥🔥🔥
A Super hero Film#NandamuriBalakrishna #NBK110 pic.twitter.com/cbc7nGR1QF
— NBK Cult 🦁 (@iam_NBKCult) August 1, 2023