ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులను చిత్ర పరిశ్రమ కొల్పోతుంది. తాజాగా ప్రముఖ పాటల రచయిత్రి మాయా గోవింద్(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన ట్యూమర్ తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారుడు అజయ్ తెలిపారు.” బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. చికిత్స తర్వాత కూడా కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో గురువారం గుండెపోటు రావడంతో అమ్మ చనిపోయింది” అంటూ అజయ్ భావోద్వేగానికి లోనయ్యారు.
మాయా గోవింద్ ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందినవారు. ఈమెకు చిత్రపరిశ్రమకు చెందిన రామ్ గోవింద్ తో వివాహం జరిగింది. మాయా గోవింద్ సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. తన కలం నుంచి అనేక అద్భుతమైన పాటలను పరిశ్రమకు అందించింది. గోవింద్ సుమారు 350 సినిమాలకు పనిచేశారు.”ఆంఖో మే బేస్ హో తుమ్” , “ఖిలాడీ తూ అనారీ”, “మోర్ ఘటర్ ఆయే సజన్ వా”, ‘గుటుర్ గుటుర్’ వంటి ఎన్నో పాపులర్ పాటలు ఆమె కలం నుంచి జాలువారాయి. ఆమె మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.