ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అలాగే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. ‘సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం’ అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. ‘ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్’ అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్‌ను తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.
Ok Google, play Sirivennela songs 😞💔
“సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌
— Google India (@GoogleIndia) November 30, 2021