వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దృశ్యం 2 కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్తేర్ అనిల్ కి సంబంధించిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు దృశ్యం చిత్రంలో నటించిన ఆ చిన్నపాప ఇంతగా మారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ అమ్మడి ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా షాక్ తినక తప్పదు.
దృశ్యం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో చిన్నారిగా కనిపించిన ఈ పిల్ల.. అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వెంకటేశ్ దృశ్యం సినిమాలో చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. క్లయిమాక్స్ లో ఆ చిన్నారి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఈమె వయస్సు 19 ఏళ్లు. దీనికి తగ్గట్టుగానే ఫోటోషూట్లో అందాలు బాగా ఆరబోసింది. ఎస్తేర్ అనీల్ లుక్ అదుర్స్ అంటున్నారు. అప్పుడు బేబీ ఎస్తర్ అని పిలిచినా వారు ఇప్పుడు ఈ భామ మిస్ ఎస్తర్ అంటూ పిలుస్తున్నారు.
ఇక ఎస్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం తన ఫొటోలతో అభిమానులను పలకరిస్తుంది. ఇక ఏమాత్రం మొహమాటపడకుండా బోల్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఎస్తేర్ ఇప్పటికే మలయాళంలో హీరోయిన్ గా బిజీ అవుతోంది. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి.
ఇక్కడ కుర్ర హీరోలకు ఎస్తేర్ అనిల్ సరైన జోడీగా కనిపిస్తుంది. కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎస్తేర్ అనిల్ మారిపోయిన విధానం చూసి అందరు షాక్ అవుతున్నారు. అందాల ఆరబోతలో కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇప్పుడు విడుదలైన ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతుంది. తాజాగా వెంకటేశ్ హీరోగా విడుదలైన దృశ్యం 2 సినిమాలో కూడా ఈమె నటించింది.