సినీ తారల చిన్నప్పటి ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. అయితే చైల్డ్ ఆర్టిస్టుల విషయంలో మాత్రం వాళ్లు పెద్దయ్యాక ఎలా ఉన్నారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కాస్త వినూత్నమనే చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్, మాస్ మసాలా మూవీస్ చేస్తూనే ఆయన విభిన్నమైన సినిమాలు కూడా చేస్తుంటారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. అదే విధంగా వీలు కుదిరినప్పుడల్లా ‘ఘర్షణ’, ‘ఈనాడు’ లాంటి ప్రత్యేకమైన చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన మరో విభిన్నమైన సినిమానే ‘దృశ్యం’. మలయాళంలో జీతూ జోసెఫ్ తీసిన ‘దృశ్యం’ను అదే పేరుతో తెలుగులో తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌లో తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించారు. ఆయన సరసన మీనా కథానాయికగా యాక్ట్ చేశారు. మలయాళ మాతృక మాదిరిగానే తెలుగులోనూ ‘దృశ్యం’ మంచి విజయం సాధించింది.
తెలుగు ‘దృశ్యం’లో వెంకీ, మీనాతో పాటు పలువురు నటీనటులు తమ యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. వారిలో ఒకరు ఏస్తర్ అనిల్. వెంకీ, మీనాల కూతురిగా భయపడే పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు. ‘దృశ్యం’ సీక్వెల్లోనూ సందడి చేశారు ఏస్తర్. ఆమెకు సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. ‘దశ్యం’ తొలి పార్ట్‌లో చిన్న పాపలా ఉన్న ఏస్తర్ అనిల్ ఇప్పుడు ఎదిగిపోయారు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏస్తర్ పెట్టే ఫొటోలు, వీడియోలు చూసి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగులో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు గ్లామర్‌గానూ ఉన్న ఏస్తర్ త్వరలో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.