Johnny Depp: ప్రపంచ వ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది హాలీవుడ్ నటుల్లో జానీ డెప్ ఒకరు. ఆయన జానీ డెప్‌గా కంటే.. కెఫ్టెన్ జాక్ స్పారోగానే ప్రేక్షకులకు సుపరిచితం. జానీ డెప్ నటించిన ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ సినిమాలు రిలీజైన ప్రతీసారి పాత రికార్డులు బద్దలయ్యాయి.. భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇక, జానీ డెప్ క్యారెక్టర్ చేసే విన్యాసాలు చూడటానికి జనం థియేటర్లకు క్యూ కట్టారు. ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్‌లోని ‘సల్జెర్స్ రివెంజ్’ సినిమా తర్వాత ఓ అనుకోని ఘటన జరిగింది. ఈ సిరీస్‌నుంచి జానీ డెప్ తప్పించబడ్డాడు. దీనికి ఓ కారణం ఉంది. భార్య ఆంబర్ హియర్డ్‌తో కోర్టు వివాదాల నేపథ్యంలో..
‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ నిర్మాణ సంస్థ డిస్నీ జానీపై నిషేధం విధించింది. ఇక, నిషేధం విధించి దాదాపు 4 సంవత్సరాలు గడిచింది. భార్యతో కోర్టు కేసుల్లో జానీ డెప్ గెలిచాడు. నిర్ధోషిగా బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో జానీడెప్‌పై నిషేధం విధించిన డిస్నీ తమ తప్పును తెలుసుకుంది. జానీ డెప్‌పై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు! నిషేధం విధించినందుకు ట్విటర్ వేధికగా బహిరంగ క్షమాపణ చెప్పింది.
తమ నిర్మాణ సంస్థలో జాక్ స్పారోగా మరోసారి నటించాలని జానీ డెప్‌ను కోరింది. ఇందుకోసం ఏకంగా 301 మిలియన్ డాలర్లు( ఇండియన్ కరెన్సీలో 2355 కోట్ల రూపాయలు) ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్‌కు జానీ ఎలాంటి సమాధానం ఇస్తాడో తెలియాల్సి ఉంది. పెద్ద మొత్తం కాబట్టి ఒకే చేప్తాడా? లేక తనను అవమానించినందుకు నో చెప్తాడా?.. వేచి చూడాలి. మరి, జానీ డెప్‌కు డిస్నీ చేసిన భారీ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : శ్రీవారి సన్నిధిలో హీరో శ్రీకాంత్ కుటుంబం.. వీడియో వైరల్
How a false case by fake feminism destroyed your life & career 🙏😮💨
Finally satyamev jayate 🙏😍#jhonnydepp #jhonnydeppvsamberheard#AmberHeardCommittedPerjury@JhonyDeep6 @mentalksorg @mpnewsin @Mitesh47738983 @PurushAayogIN @cskkanu @ActivistsMen @MensRightMatter pic.twitter.com/HeaoALSu3U— 2idiot films (@ThapaAnup) June 27, 2022