టాలీవుడ్ లో చిత్రం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న ఉదయ్ కిరణ్ విధి వక్రించి అనుకోని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు. టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో సత్తా చాటుతూ స్టార్ హీరోలుగా ఎదిగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్. తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై ఎంతో మంది రక రకాలుగా తమ అభిప్రాయాలు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకులు తేజ ఈ విషయంపై ఆసక్తికర్ వ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ మంచి భవిష్యత్ ఉన్న హీరో. అయినా విధి వక్రించి అనుకోని కారణాల వల్ల అతడు చనిపోయాడు. ప్రముఖ దర్శకులు తేజకు హీరో ఉదయ్ కిరణ్ కు మంచి రిలేషన్ ఉండేది. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ‘చిత్రం’మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రీమాసేన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. తర్వాత తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘అహింస’మూవీ తెరకెక్కుతుంది.. ఈ మూవీలో దగ్గుబాటి అభిరాం హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 2న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ తో తేజ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు.
ఇప్పటి వరకు డైరెక్టర్ తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదో ఒక సందర్భంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యాత ‘హీరో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సార్’ అని అడిగారు. దీనికి తేజ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మృతి వెనుక అసలు నిజం అందరికీ తెలుసు.. ఎందుకో ప్రతిసారీ నాతో చెప్పించాలని ఎందుకు చూస్తున్నారు? అందరికీ తెలిసిన ఈ విషయం ఎవరికీ ఏమి తెలియనట్లు ఎందుకు నటిస్తున్నారో తెలియడం లేదు’ అని తేజ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత తేజ తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. వాళ్ల అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడని.. తొందరలోనే హీరోగా పరిచయం చేస్తానని చెప్పారు. అమ్మాయి కూడా చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేసిందని, ఆమెకు పెళ్లి చేయను.. నచ్చిన వాడిని చూసుకుని ఆమెనే పెళ్లి చేసుకోమన్నానని ఆయన తెలిపారు. ఒక వేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకుల ఇచ్చేయమన్నాను. నా ఇద్దరి పిల్లలకు జీవితంలో సంతోషంగా ఉండడం కోసం ఏది చేయాలనిపిస్తే అదే చేయాలని చెప్పానన్నారు. ఇతరుల కోసం ఆలోచించొద్దని చెప్పానన్నారు.