తెలుగులో ఆర్య, ఆర్య-2, బాహుబలితో పాటు ఓంకార్ రాజుగారి గది, ఎప్-2లు ఉన్నాయి. ఇవి తొలి సినిమా నుండి పుట్టుకొచ్చిన కొత్త కథలు. హీరోలు మారరు. కానీ హిట్ సిరీస్ కాస్త భిన్నం. కథ క్రైమ్ చుట్టూనే తిరుగుతుంటుంది.. హీరోలు మారుతున్నారు. అయితే హిట్ 3 తెరకెక్కక ముందే.. హిట్-4కు కథ సిద్ధం చేసుకున్నారట దర్శకుడు శైలేష్ కొలను
హాలీవుడ్, బాలీవుడ్‌లకు మాత్రమే పరిచయం అయిన సినిమా సిరీస్‌లు దక్షిణాది సినిమాలకు పాకాయి. ధూమ్, కోయి మిల్ గయా టూ క్రిష్, గోల్ మాల్ సిరీస్‌లు అనేకం ఉన్నాయి. మొదటి సినిమాకు కొనసాగింపుగా కొత్త ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ వర్షన్ స్టార్ట్ అయ్యింది. సూర్య సింగం, ముని సిరీస్‌లు వచ్చాయి. తెలుగులో ఆర్య, ఆర్య-2, బాహుబలితో పాటు ఓంకార్ రాజుగారి గది, ఎప్-2లు ఉన్నాయి. ఇవి తొలి సినిమా నుండి పుట్టుకొచ్చిన కొత్త కథలు. హీరోలు మారరు. కానీ హిట్ సిరీస్ కాస్త భిన్నం. కథ క్రైమ్ చుట్టూనే తిరుగుతుంటుంది.. హీరోలు మారుతున్నారు. విశ్వక్ సేన్ హిట్- ఫస్ట్ కేసులో కనిపించగా.. రెండవ దానిలో అడవి శేష్ హీరో అయ్యారు. ఇక హిట్-3లో నాని కనిపించబోతున్నాడు. ఇప్పటికీ అఫీషియల్‌గా కన్ఫమ్ అయిపోయింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కకుండానే హిట్-4కి కథ సిద్ధం చేశారట డైరెక్టర్ శైలేష్ కొలను. అయితే ఈ సినిమా.. తెలుగు టాప్ హీరోతో చేయబోతున్నారట.
ఆయనే మన నందమూరి నట సింహం బాలకృష్ణ. మాస్‌లో ఊర మాస్ అయిన బాలయ్య అఖండ, వీర సింహా రెడ్డి విజయాలతో మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో తన 108వ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు భగవత్ కేసరి పేరును పెట్టనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తోంది. ఈ నెల 10న అధికారికంగా సినిమా పేరు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే శైలేష్ కొలను సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇటీవల బాలయ్య బాబును కలిసిన శైలేష్ ..కథను చెప్పారట. బాలయ్యకు కథ నచ్చిందీ కానీ, ఊ అని కానీ, ఊహూ అని కానీ చెప్పలేదట. బాలయ్యకు కథ నచ్చితే.. బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10న ప్రకటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం శైలేష్ కొలను వెంకటేష్‌తో కలిసి సైంథవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాతే హిట్-3 షూటింగ్ ఉండబోతోంది. బాలయ్య కూడా ఓకే అంటే హిట్-4 కూడా త్వరలోనే పట్టా ఎక్కే అవకాశాలు లేకపోలేదు.