‘కేజీఎఫ్’.. పేరుకే కన్నడ సినిమా అయినప్పటికీ వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించింది. వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీలో హీరోగా చేసిన యష్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే సౌత్ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ తీస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరదశకు వచ్చేసింది. దీంతో మూవీ టీమ్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తోంది. ఇలాంటి టైంలో అభిమానుల చేసిన ఓ పనివల్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఘోరంగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేజీఎఫ్ 1,2 పార్ట్ లు పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తొలి భాగంగా 400 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే.. సీక్వెల్ మాత్రం ఏకంగా రూ.1200 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. దీనికి తోడు మూడో భాగం కూడా ఉంటుందని సీక్వెల్ చివర్లో హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం చెప్పలేదు. మొన్నటికి మొన్న ‘కేజీఎఫ్’ నిర్మాతలు మాట్లాడుతూ.. 2025లో ‘కేజీఎఫ్ 3’ షూటింగ్ ప్రారంభం కావొచ్చని చెప్పారు. దీనిపై యష్ ఫ్యాన్స్ తెగ అప్ సెట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఆ కోపం అంతా కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై చూపించారా అనిపిస్తుంది.
ఎందుకంటే కేజీఎఫ్ 3, సలార్ అప్డేట్స్ గురించి యష్, ప్రభాస్ అభిమానులు అదేపనిగా ప్రశాంత్ నీల్ కు మెసేజులు పెట్టినట్లు ఉన్నారు. దీంతో తన ట్విట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేసేశాడు. ప్రస్తుతం అతడి పేరుమీద సెర్చ్ చేస్తుంటే.. అందుబాటులో లేదు అని చూపిస్తుంది. డైరెక్టర్స్ ఇలా సోషల్ మీడియాకు దూరం కావడం ఇదేం కొత్త కాదు. గతంలో ‘ఆచార్య’ టైంలోనూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న కొరటాల శివ.. తన సోషల్ మీడియా ఖాతాల్ని అన్నింటిని క్లోజ్ చేశాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Hey neel come back 🔙 kgf chapter 3 enna ede #PrasanthNeel https://t.co/dBnlVCmYuI pic.twitter.com/3LERRmtKqx
— Mahesh N (@MaheshN66252385) January 9, 2023