డార్లింగ్ ప్రభాస్ అనగానే హీరోయిన్ అనుష్కనే గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్ల బాండింగ్ అలాంటిది. బిల్లాతో మొదలైన వీరి బంధం.. ఆ తర్వాత మిర్చి, ‘బాహుబలి’ రెండు సినిమాల వరకు సాగింది. టాలీవుడ్ లో ప్రస్తుత జనరేషన్ లో ఫెర్ఫెక్ట్ జోడీ అంటే వీళ్లదే! ఆ విషయం ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ వీళ్లిద్దరూ కలిసినా సరే ఆ విషయం హాట్ టాపిక్ అవుతుంది. ఇకపోతే వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని ఈ ఇద్దరూ కూడా చెక్ పెడుతూనే ఉన్నారు. ఇక వీళ్ల గురించి తాజాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ హీరోగా చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక డార్లింగ్ కెరీర్ లో స్టైలిష్ మూవీ అంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ పేరు ‘బిల్లా’. ఇందులో సూట్ వేసుకుని ప్రభాస్ అలా నడిచొస్తుంటే, వెనక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మొత్తం సీన్ నే ఎలివేట్ చేసింది. ఇప్పటికీ అభిమానులకు కిక్కిస్తూనే ఉంది. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాని మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ ని అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఆ సినిమా డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రభాస్-అనుష్క జోడీ గురించి మాట్లాడారు.
”బొమ్మాళీ నిన్ను వదలా బొమ్మాళీ’.. ఇదే మన సాంగ్ అని ప్రభాస్, అనుష్కలకు చెప్పాను. అందరూ లైట్ తీసుకున్నారు. నేను, మణిశర్మ మాత్రం సీరియస్ గా తీసుకున్నాం. ఇకపోతే ‘అరుంధతి’ లాంటి మూవీ చేసిన అనుష్క.. ‘బిల్లా’తో మళ్లీ గ్లామర్ సైడ్ వచ్చింది. ఇండియాలోనే ప్రభాస్-అనుష్కని మించిన జోడీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్ గానూ జోడీగా చాలా గుర్తింపు తెచ్చుకున్నారు.’ అని మెహర్ రమేశ్ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తుండగా.. మరోవైపు అనుష్క, నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేస్తోంది. ఇంకా సింగిల్ గానే ఉన్నారు. వేర్వేరుగా అయినా వీళ్లు పెళ్లెప్పుడు చేసుకుంటారో తెలియాల్సి ఉంది.