హైదరాబాద్ నడిబోడ్డున సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో బాధితుడికి కఠిన శిక్ష విధించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వినతులు మిన్నంటుతున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రతీ ఒక్కరూ వేడకుంటున్నారు. గతంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనలో బాధితులకు సరైన న్యాయం జరిగిందని, అలాంటి న్యాయం మళ్లీ కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.
తాజాగా ఇదే అంశంపై స్పందించారు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. సజ్జనార్ సార్ మళ్లీ రావాలి. తక్షణ సాయం ఎంతో అవసరమని అన్నారు. లేకపోతే గనుక ఇలాంటి దాడులు ఆగవంటూ ఆయన తెలిపారు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయాలని నేను అనుకోవట్లేదని, కానీ ఇలాంటి వార్తల ద్వారా స్పూర్తి పొందె దిక్కుమాలిన వ్యక్తులున్నారని అని ఆవేదన తెలియజేశారు. ఇక హరీష్ శంకర్ ట్విట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి