తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కడుపునొప్పి కారణంగా మంగళవారం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రస్తుతం నిలకడగానే ఉన్నారని చెప్పారట. మరో రెండు రోజులపాటు భారతీరాజా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. దర్శకుడిగా భారతీరాజా గురించి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ గా రికార్డులకెక్కాయి. అయితే.. దర్శకుడిగా సినిమాలు తగ్గించిన భారతీరాజా.. ఇప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నారు.
BharathiRaja admitted in hospital. Wish him a speedy recovery 🙏 pic.twitter.com/qovpFji4NK
— Mahesh 🇮🇳 (@Mahesh10816) August 23, 2022