తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కడుపునొప్పి కారణంగా మంగళవారం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. ప్రస్తుతం నిలకడగానే ఉన్నారని చెప్పారట. మరో రెండు రోజులపాటు భారతీరాజా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడిగా భారతీరాజా గురించి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో […]
ఇండియన్ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ డామినేషన్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ ముందంజలో ఉందని సీనియర్ దర్శకుడు భారతీ రాజా అభిప్రాయపడ్డారు. కరుణాస్ కథానాయకుడిగా వెన్నెల క్రియేషన్స్ పంతాకంపై పి.శశికుమార్ ‘ఆధార్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రాంనాథ్ పళణికుమార్ రచించి.. దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన […]