ఇండియన్ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ డామినేషన్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ ముందంజలో ఉందని సీనియర్ దర్శకుడు భారతీ రాజా అభిప్రాయపడ్డారు. కరుణాస్ కథానాయకుడిగా వెన్నెల క్రియేషన్స్ పంతాకంపై పి.శశికుమార్ ‘ఆధార్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రాంనాథ్ పళణికుమార్ రచించి.. దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో అట్టహాసంగా జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన భారతీ రాజా తమిళ ఇండస్ట్రీ విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో అసిస్టెంట్ డైరెక్టర్ మృతి!
ఆధార్ ట్రైలర్ చూసిన భారతీ రాజా ఎంతో మెచ్చుకున్నారు. కరుణాస్ పసిబిడ్డతో రోడ్డుపై నడుస్తూ ఉండంటం చూసి తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు. మరోవైపు నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ తమిళ సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఓ సినిమాకి రూ.410 కోట్లు ఖర్చు పెడుతుంటే.. అందులో కథ కోసం కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చవుతున్నాయి. మిగిలిన రూ.400 కోట్లు నటులు తమ కోసమే ఖర్చుపెట్టిస్తున్నారని, అందుకే తమిళ ఇండస్ట్రీ నశించిపోతోందని అరుణ్ పాండ్యన్ ఆవేదన చెందారన్నారు. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీపై భారతీ రాజా ప్రశంసలు కురిపించారు. నిజానికి తమిళ ఇండస్ట్రీ మార్కెట్, బిజినెస్ విషయంలో టాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోదని తెలిపారు. కానీ, ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీల కన్నా తెలుగు సినిమాలే ప్రేక్షకులను అలరిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. భారతీ రాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.