Dhanush: హాలీవుడ్‌లో నటించే అవకాశాలు అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్ ఒకరు. ధనుష్ ‘ది ఎక్స్‌ట్రాడ్నరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ‘ది గ్రే మ్యాన్’ అనే మరో ఇంగ్లీష్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. జోయ్ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇందులో క్యాప్టన్ అమెరికా ఫేమ్ క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా, చిత్ర ప్రీమియర్‌ను అమెరికాలో నిర్వహించారు. అక్కడ చిత్ర ప్రీమియర్ చూసిన ధనుష్ తన పాత్ర విషయంలో అసంతృప్తి చెందారని సమాచారం. సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం.. అంతగా ప్రాధాన్యత లేని పాత్ర అవ్వటం వల్ల మనసు నొచ్చుకున్నారంట. అంతేకాదు! హాలీవుడ్ సినిమాల్లో నటించే విషయంలో ప్రభాస్, రామ్ చరణ్‌లను హెచ్చరించారట. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల భారీ విజయాల తర్వాత ఈ ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ దర్శకులు వారిని తమ సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారంట.
ఈ విషయం తెలుసుకున్న ధనుష్ హాలీవుడ్ అవకాశాల విషయంలో ప్రభాస్, చరణ్‌లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారట. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే వద్దని చెప్పాలన్నారంట. పెద్ద సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో చేయటం, ప్రాధాన్యత లేని రోల్స్ చేయటం ద్వారా స్టార్‌డమ్ దెబ్బతింటుందని అన్నారంట. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ ముగ్గరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మరి, హాలీవుడ్ ఆఫర్ల విషయంలో ధనుష్.. ప్రభాస్, రామ్ చరణ్‌లను హెచ్చరించారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం! వైద్యులు ఏం చెప్పారంటే?