Dhanraj: జబర్థస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు ధన్‌రాజ్. జబర్థస్త్ షోలోకి రావటానికి ముందు చాలా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. షోలోకి రాగానే ధనాధన్ ధన్‌రాజ్‌గా మారిపోయారు. తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. అంతేకాదు! తానే ఓ సినిమా నిర్మించారు. అయితే, ఆ సినిమా ప్లాప్ కావటంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం ముందున్నన్ని సినిమా అవకాశాలు లేవు. అడపాదడపా సినిమాలతో పాటు ఓ ప్రముఖ ఛానల్లో కామెడీ షో చేస్తున్నారు. తాజాగా, ఆయన ప్రముఖ కామెడీ షో ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’కి వచ్చారు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తన సినిమా రిలీజ్ అప్పుడు పవర్ స్టార్‌కు ఓ ట్వీట్ చేస్తే.. ఆ ట్వీట్‌కు ఆయన జవాబు ఇచ్చారని, సినిమా హిట్ కావాలని కోరుకున్నారని చెప్పారు. ఇంతలో ఆది కల్పించుకుని ‘‘ అన్న! మీరు కల్యాణ్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా?’’ అని ప్రశ్నించాడు. ధన్‌రాజ్ వెంటనే ఫోన్ తీసి ఎవరికో డైల్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ‘హలో చెప్పండి ధన్‌రాజ్ గారు’ అన్న పవన్ వాయిస్ వినిపించింది. అయితే, అవతల మాట్లాడింది నిజంగా పవన్ కల్యాణా?.. లేక రేటింగ్ జిమ్మిక్కా అన్నది తెలియాలంటే.. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. మరి, పవన్‌కు ధన్‌రాజ్ ఫోన్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ram Charan: యాడ్ కోసం రూ. 7 కోట్లు తీసుకున్న రామ్ చరణ్