ఆమెని చూస్తే మీరు లవ్ లో పడిపోవడం గ్యారంటీ. డ్యాన్స్ చేస్తే.. మీరు ఊగిపోవడం పక్కా. తెలుగమ్మాయి అయిన ఈమె.. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను సినిమాలతో బిజీగా ఉంది.
ఈమె తెలుగు మూలాలున్న అమ్మాయి. పుట్టింది అమెరికాలో గానీ పెరిగింది మాత్రం మన దేశంలోనే. చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ పిల్ల.. టీనేజ్ లోకి వచ్చేసరికే ఏకంగా హీరోయిన్ అయిపోయింది. అదే ఊపులో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టేసింది. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఎంతలా అంటే.. ఈమె ఫొటోని వాల్ పేపర్ పెట్టుకునేంతగా. ప్రస్తుతం అరడజను తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె.. ప్రస్తుతం యూత్ లో సెన్సేషన్. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొందరు హీరోయిన్లు నవ్వితే బాగుంటారు, కొందరు హీరోయిన్లు డ్యాన్స్ చేస్తే ఇంకా బాగుంటారు. మరికొందరు క్యూట్ గా యాక్టింగ్ చేసి ప్రేక్షకుల్ని పడేస్తారు. ఇలా ఒక్కో హీరోయిన్ ఒక్కో దానిలో స్పెషల్ అయ్యిండొచ్చు. కానీ ఇవన్నీ కలిపితే హీరోయిన్ శ్రీలీల అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైన కనిపిస్తున్న చిన్నారి ఆమెనే. చిన్నప్పుడు ఎంత అందంగా ఉందో పెద్దగా అయిన తర్వాత మరింత అందంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ తనతో లవ్ లో పడేలా చేస్తోంది. అమెరికాలో తెలుగు మాట్లాడే ఫ్యామిలీ పుట్టిన ఈమె.. పేరెంట్స్ తో విడాకులు తీసుకోవడంతో తల్లితో కలిసి బెంగళూరు వచ్చేసింది. అక్కడే పెరిగింది.
చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్న శ్రీలీల.. పెద్దయ్యాక డాక్టర్ కావాలనుకుంది. అయితే MBBS చదువుతుండగానే హీరోయిన్ అయిపోయింది. తొలుత కన్నడలో 2019లో ‘కిస్’ సినిమా చేసిన శ్రీలీల, అదే ఏడాది ‘బరాతే’ అని మరో మూవీ చేసింది. 2021లో ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే ఈమె అందానికి, క్యూట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. గతేడాది చివర్లో వచ్చిన ‘ధమాకా’.. శ్రీలీల క్రేజ్ ని అమాంతం పెంచేసింది. ఇందులో ఆమె యాక్టింగ్ తోపాటు మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేసింది. కలెక్షన్స్ లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఆ భామ చిన్నప్పటి ఫొటోలు వైరల్ అయ్యాయి. మరి శ్రీలీలని చిన్నప్పటి ఫొటోల్లో ఎంతమంది గుర్తుపట్టారు. కింద కామెంట్ చేయండి.