దీప్తీ సునైనా.. టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ తో ఫేమ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తర్వాతి నుంచి దీప్తీ సునైనా సెలబ్రిటీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ వల్లే ఆమె లవ్ బ్రేకప్ అయ్యిందిని అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ జశ్వంత్- సిరితో చనువుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ మ్యాటర్ బయటకు నెగెటివ్ గా వెళ్లడంతో షణ్నూకి దీప్తీ బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాతి నుంచి లైఫ్ లో ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకే ప్రయత్నిస్తోంది. ప్రేమ విఫలమయ్యాక అందరిలా దీప్తీ సునైనా కుంగిపోకుండా.. స్ట్రాంగ్ గా నిలబడి ముందుకు వెళ్తోంది.
అంతేకాకుండా ఎంతో మందికి దీప్తీ సునైనా ఆదర్శంగా కూడా నిలుస్తోంది. ఆమె తన అభిమానులను వీడియోస్, సాంగ్స్, డాన్స్ తో అలరించడమే కాకుండా.. జీవితంపై వారికి కొన్ని విలువైన సందేశాలు కూడా ఇస్తుంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులలో సందేశాత్మక పోస్టులు కూడా ఎక్కువే ఉంటాయి.అంతేకాకుండా దీప్తీకి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఎక్కువే. ఎప్పుడూ షూట్స్ చేయడం, తినడం, పడుకోవడం కాకుండా.. డైలీ మిస్ కాకుండా జిమ్ కు వెళ్తుంది.. అందరినీ వెళ్లమని ప్రోత్సహిస్తుంది కూడా. తాజాగా తన ఫిట్ నెస్ లెవల్స్ ను చూపిస్తూ దీప్తీ సునైనా పెట్టిన యోగాసనాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బెడ్ మీద దీప్తీ సునైనా వేసిన శీర్షాసనం చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. దీప్తీ ఫిట్ నెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.