ఒకప్పుడు సినిమా స్టార్స్ ని సెలబ్రిటీలు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా స్టార్స్ తో సెలబ్రిటీలు అయిపోతున్నారు. ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నారు. అలా యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయిన వారిలో దీప్తి-షన్ను జోడీ కచ్చితంగా ఉంటుంది. ఆల్బమ్ సాంగ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన వీళ్లిద్దరూ వేర్వేరుగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జంటగానూ చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్స్ లో పాల్గొన్నారు. ఇక మంగళవారం, దీప్తి బర్త్ డే సందర్భంగా షన్ను విషెస్ చెప్పాడు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూట్యూబర్స్ గా ఫేమ్ తెచ్చుకున్న తెలుగు పర్సన్స్ లో షన్ను, దీప్తి కచ్చితంగా ఉంటారు. బిగ్ బాస్ 2వ సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్న దీప్తి.. ఆ తర్వాత ఓన్ గా సాంగ్స్ లో యాక్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఐదో సీజన్ లో పాల్గొన్న షన్ను కూడా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విన్నర్ మాత్రం కాలేకపోయాడు. అయితే షన్ను బిగ్ బాస్ లో ఉన్న టైంలో సిరితో క్లోజ్ గా మూవ్ కావడం బహుశా దీప్తికి నచ్చినట్లు లేదు! అందుకే షో నుంచి బయటకొచ్చిన కొన్నిరోజులకే వీరిద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఈ విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇక అప్పటినుంచి కూడా దీప్తి తనకు తాను సాంగ్స్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. మరోవైపు షణ్ముక్ జస్వంత్ పలు వెబ్ సిరీసులు చేస్తున్నాడు గానీ గతంతో పోలిస్తే ఆచితూచి యాక్ట్ చేస్తున్నాడు. త్వరలో ‘జాను’ అనే సాంగ్ తో ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. దీంతో ఇద్దరూ దాదాపు మాటల్లేవు అనిపిస్తుంది. మరోవైపు మంగళవారం దీప్తి బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే D’అని షన్ను, తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. దీప్తి పేరు చెప్పనప్పటికీ, ఈ విషెస్ ఆమెకే అని ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘ట్రూ లవ్’ అంటే నీదే షన్ను అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.