Surya, Jyothika: సూర్య, జ్యోతిక దంపతులను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘‘జై భీమ్’’ సమయంలో మొదలైన ఓ వివాదం సద్ధుమణిగిందనుకునే లోపే మరోసారి తెరపైకి వచ్చింది. ‘‘జై భీమ్’’ కథానాయకుడు సూర్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా, ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్‌లు ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
కాగా, ‘‘జై భీమ్’’సినిమాలో తమ కులాన్ని కించపరిచారని ఆరోపిస్తూ వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘ జై భీమ్’’ సినిమా ప్రముఖ లాయర్ జస్టిస్ కె. చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. సూర్య, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దేశ వ్యాప్తంగా మంచి ఆదరణను పొందింది. మరి, సూర్య దంపతులపై కోర్టు ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : దంగల్ రికార్డులు బ్రేక్.. కొనసాగుతున్న KGF-2 కలెక్షన్స్ సునామి!