రెండు అక్షరాల ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. అలా ఎందరో ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా జైలులో ఉన్న ఓ యువకుడు ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు.
రెండు అక్షరాల ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. అలా ఎందరో ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు మాత్రం పెద్దలను ఎదిరించి పారిపోయి మరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇరువైపుల కుటుంబాల వారు కిడ్నాప్ కేసులు పెట్టుకుంటున్నాయి. ఇలా చాలా ప్రేమ జంటల స్టోరీల్లో ఎన్నో ట్విస్టులో జరుగుతుంటాయి. తాజాగా జైలులో ఉన్న ఓ యువకుడు కోర్టు అనుమతితో ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బిహార్‌లోని సీతామఢీ జిల్లా బర్గానియాలో నివాసం ఉండే రాజా(28), అర్చన(23) ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో గొడవలు జరిగాయి. కొంతకాలం ఇద్దరు దూర దూరంగా ఉన్నారు. అయితే గత నవంబరులో రాజా, అర్చన తమ ఇళ్లలో నుంచి పారిపోయారు. యువతి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. రాజాపై కిడ్నాప్ కేసు పెట్టాడు. దీంతో అతడిని వెతికి పట్టుకున్న పోలీసులు అతణ్ని జైలు పంపారు. ఈ కేసుపై ఇటీవల స్థానిక కోర్టులో విచారణ జరిగింది. అర్చన, రాజాకి పెళ్లి జరిపిస్తామని ఇరువురి కుటుంబ సభ్యులు కోర్టు సమక్షంలో అంగీకరించారు.
దీనికి న్యాయస్థానం అనుమతి తెలిపింది. అయితే యువతి కుటుంబ సభ్యులు తమ పెళ్లి జరిపించరని రాజా అనుమానం వ్యక్తం చేశాడు. అలానే తమ ఇద్దరికి ప్రాణ హాని ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో కోర్టు పోలీసులు సమక్షంలో పెళ్లి జరిపించాలని తీర్పు ఇచ్చింది. శనివారం వారిద్దరికి పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగింది. వివాహానంతరం రాజాను పోలీసులు జైలుకు తరలించారు. తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా పడింది. మరి.. ఈ విచిత్ర పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.