సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే ఒక్క డైలాగ్ తో ఎంతో పాపులర్ అయ్యాడు. చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి స్టార్ కమెడియన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ఆర్టిస్ట్ గానే కాకుండా పొలిటికల్ గా కూడా మంచి ఇమేజ్ ను సాధించాడు. గతంలో ఈ కమెడియన్ పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. తిరిగి కొంతకాలం నుంచి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఏపీ04 అనే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాయల్ నా లవర్’ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
రామ్ జక్కల, అఖిల ఆకర్షణ హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఏపీ04 రామాపురం’. ఎస్వీ శివారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు హేమా రెడ్డి దర్శకత్వం వహించారు. ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఏపీ04 రామాపురం సినిమా ట్రైలర్ వేడుకలో పాల్గొన్న కమెడియన్ పృథ్వీరాజ్ సందడి చేశారు. తనదైన మాటలతో అక్కడ నవ్వులు పువ్వులు పూయించాడు. ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..” ఈ చిత్ర బృందం చాలా కష్టపడి పనిచేసింది. వాళ్లు ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. మేము కూడా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలనే తపన తో వాళ్లు వచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నిర్మాతను, డైరెక్టర్ ను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అంటూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న బిగ్ బాస్ ఫేమ్ మోడల్ జెస్సీతో సరదగా కామెడీ చేశాడు. జెస్సీని పొగొడుతూ పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేశారు. ” నేను, జెస్సీ మాయ పేటిక సినిమాలో నటించాము. అందులో నేను వచ్చేసి.. పాయల్ రాజ్ పుత్ లవర్ ని. ఇతడు కనిపించిన ప్రతి అమ్మాయిని.. సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తుంటాడు. కొద్ది సేపటికే నెంబర్ ప్లీజ్ అంటూ అమ్మాయిలను అడిగేస్తాడు. అది చూసి నేను ఆశ్యర్యపోతుంటాను” అంటూ మాయపేటిక సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఏపీ04 రామాపురం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పృథ్వీ తెలిపాడు.