మీరు సినిమా ప్రియులా! ఏ సినిమా రిలీజైన థియేటర్ కు పరుగులు పెడుతుంటారా! అయితే, ఈ వార్త మీకు ఆనందాన్నిచ్చేదే. ఎందుకంటే.. ఈ న్యూస్ ద్వారా మీరు 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని పొందుతున్నారు. అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌లలో ఈ ధరకు సినిమా చూడొచ్చు. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సినిమాస్ ఈ ఆఫర్ కల్పిస్తోంది. కాకుంటే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే.
ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం(Cinema Lovers Day) సందర్భంగా పీవీఆర్ సినిమాస్ ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లలో అన్ని షోలలో రూ.99కే సినిమా చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనం. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్‌టీతో కలిపి ఉండనుంది. తెలంగాణలో మాత్రం రూ.112+జీఎస్‌టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ అయిన రిక్లైనర్, ఐమాక్స్, 4డీఎక్స్ వంటివి ఈ ఆఫర్ పరిధిలోకి వు. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్ ను సందర్శించండి.
🌟PVR Cinema : Book Any Ticket at Rs.99 On 20th Jan🤩
⭕You Can Book from Any App Like Paytm, Amazon, Etc
Just Select PVR Cinema & Date 20th January#PVR #pvrcinemas pic.twitter.com/1gkrEquhFF
— Deals24 (@Deals24_) January 18, 2023