మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త దూకుడు పెంచాడు. గతంలో పొలిటిక్స్ లోకి అడుగుపెట్టి కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చాల ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి అరంగేట్రం చేశారు మెగాస్టార్. ఖైదీ-150, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించి సెకండ్ ఇన్నింగ్స్ లోను వావ్ అనిపిస్తున్నాడు. వయసు మీద పడుతున్న నటనలోని వైవిధ్యాన్ని మాత్రం చెక్కుచెదరనివ్వటం లేదు ఈ హీరో.
ఇక ప్రస్తుతం చిరు టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య అనే సినిమాల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి అంటుకున్నాయి. ఈ చిత్రాన్ని కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక విషయానికొస్తే..చిరంజీవి ఈ సినిమా అనంతరం లూసీఫర్ కి రీమేక్ గా వస్తున్న మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మోహన రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వచ్చే నెలలో ఓ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట చిత్ర యూనిట్. దీనికి సంబందించిన మూహూర్తం కూడా ఖరారైందట. ఇక ఆచార్య మూవీ షూటింగ్ చివరి దశలో ఉండటంతో దీని తర్వాత మోహన రాజా సినిమాను పట్టాలెక్కనుందని తెలుస్తోంది.