ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి, కుటుంబంతో సహా హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వార తెలిపారు. ఐతే ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారని తెలిసిన చాలా మంది ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేధికగా ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు.. తను చాలా ఉత్సాహంగా, ఎర్జిటిక్‌గా ఉన్నారని తెలుసుకుని సంతోషపడ్డాను.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను.. గాడ్ బ్లెస్ తారక్.. అని చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబు, మహేశ్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ తదతరులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులైతే తమ అభిమాన హీరో పూర్తి ఆరోగ్యంతో రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.