1980 ఫిబ్రవరి 20న అంగరంగ వైభవంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖల వివాహం మద్రాస్ లో జరిగింది. అయితే ఈ రోజుతో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టి 44 ఏళ్లు. ఈ సందర్భంగా వారి పెళ్లి పత్రికతో పాటుగా వారి పెళ్లినాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తనదైన నటనతో టాలీవుడ్ లో సూపర్ హీరోగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తన నటనా జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు మెగాస్టార్. ఇక తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే సురేఖను పెళ్లి చేసుకున్నారు చిరంజీవి. ఈ రోజు (ఫిబ్రవరి 20) మెగాస్టార్ పెళ్లి రోజు. దాంతో చిరంజీవి పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రోజుతో తమ వైవాహిక బంధంలో 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు చిరంజీవి-సురేఖ దంపతులు.
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు ఫిబ్రవరి 20వ తారీఖుతో.. పెళ్లి బంధంతో ఒక్కటై 44 ఏళ్లు. 1980వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన స్నేహితులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. మద్రాసులో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 44 ఏళ్ల వీరి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ పెళ్లి రోజు కావడంతో.. నెట్టింట వారి పెళ్లి పత్రికతో పాటుగా పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక సురేఖ తన జీవితంలోకి వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయని చిరంజీవి పలు వేదికలపై చెప్పారు. ఆమె వల్లే నేను ఈ రోజు ఇంత సంతోషంగా.. షూటింగ్ లకు హాజరవుతున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఇక పెళ్లికి తాను గెస్టులా వచ్చి డైరెక్ట్ గా తాళి కట్టానని చాలా సార్లే చెప్పారు. ఇక నాకు ఎన్ని పనులు ఉన్నా.. పిల్లల బాధ్యత తనే చూసుకునేదని, ఓ ఇల్లాలుగా సురేఖ చూపించే ప్రేమ వెలకట్టలేనిదని మెగాస్టార్ పలు సందర్భాల్లో అన్నారు. మరి 44వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మెగాస్టార్ దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Wishing #Chiranjeevi garu #Surekha garu Happy Wedding Anniversary ❤❤@KChiruTweets #SurekhaKonidala
May God Bless You Both Forever 🙏❤#SurekhaAmma #MegaStarChiranjeevi pic.twitter.com/Hrv3ZdeYpc
— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 20, 2023
మెగాస్టార్ చిరంజీవి-సురేఖల పెళ్లి పత్రిక.. pic.twitter.com/KTqsopzJ75
— Hardin (@hardintessa143) February 20, 2023