మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చిరు ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ వారి కమర్షియల్ యాడ్ కోసం సుకుమార్ తో మెగాస్టార్ జతకట్టారు.ఈ యాడ్ ఫిల్మ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ యాడ్ కోసం చిరు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
ఇక ఈ యాడ్ లో చిరంజీవితో పాటు అనసూయ, నటి ఖుష్బూ కనిపించారు. అయితే.. చిరు పక్కన అనసూయ కనిపించడంతో ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ యాడ్ లో చిరు భార్యగా ఖుష్బూ నటించగా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అనసూయ కనిపించింది. అయితే ఈ యాడ్ లో నటింటిన వారంత పెద్ద స్టార్స్ కావడంతో.. ఈ యాడ్ కు వారు తీసుకున్న రెమ్యునరేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితోషికం గురించి ఆరా తీయగా మెగాస్టార్ చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది.ఈ యాడ్‌కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్‌గా, అటూ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్‌డమ్ బట్టి రెమ్మునరేషన్ ఇచ్చారట. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.