ఇటీవల ఏపీలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజానికం ఎంతగా విలవిలలాడిందో తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో వరదలు పోటెత్తడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతో.. ప్రజలు రోడ్డున పడ్డారు. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ప్రజలను ఆదుకొనేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు భారీగా విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే మహేష్ బాబు, యన్టీఆర్ వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కురిసిన అసాధారణ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతూ.. నిరాశ్రయులయ్యారు.. వారి కష్టాన్ని చూసి నా మనసు చలించిపోయింది. తన వంతు సహాయంగా రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. కాగా తండ్రి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి మొత్తం 50 లక్షల రూపాయలు విరాళం అందించారు తండ్రీ కొడుకులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చిన బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించారని మెగా అభిమానులు కొనియాడుతున్నారు.
Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021