ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన బేబీ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు.
నేటి తరం ప్రేమికుల మధ్య చోటుచేసుకుంటున్న సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు బేబీ సినిమా దర్శకుడు సాయితేజ్. జూలై 14న విడుదలైన బేబీ సినిమాకు యూత్ ను విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడంతో కలెక్షన్ల వరద పారుతోంది. కాగా ఈ సినిమాలో వైష్ణవి పాత్రలో అలరించిన హీరోయిన్ వైష్ణవి గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో వైష్ణవి చైతన్య పాపులర్ అయ్యారు. కొంత కాలం నుంచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తను నటించిన మొదటి సినిమాలోనే ఆక్టింగ్ తో అదరగొట్టింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తను ఎవరు అనే విషయాలు మీకోసం.
బేబీ సినిమాలో హీరోయిన్ ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు ఆకర్షితురాలై తన లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవడమే కాక తనను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మోసం చేస్తున్న తీరు, ఆమె ఫ్రెండ్ కు నచ్చక హీరోయిన్ కు దూరంగా ఉంటుంది. దీంతో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దీంతో ఈ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని నెటిజెన్స్ వెతికేస్తున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి పేరు కుసుమ డేగల మారి. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా కెరీర్ ఆరంభించింది. తన ఇన్ స్టా ఖాతాలో షూటింగ్ కు సంబంధించిన వీడియోలు, తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆక్టీవ్ గా ఉంటుంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. మొదటి చిత్రంతోనే నటిగా కుసుమ డేగల మారి మంచి మార్కులు కొట్టేసింది. ఇక బేబీ సినిమా హిట్ తో కుసుమ డేగల మారికి మరిన్ని సినీ అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.