బ్రహ్మానందం, అలీ.. టాలీవుడ్ స్థాయిని పెంచిన కమెడియన్స్. వందల సినిమాలతో వేలసార్లు నవ్వించారు, నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ అదేంటి?
టాలీవుడ్ లో ఉన్నంతమంది కమెడియన్స్.. ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలోనూ ఉండరు. ఆ విషయంలో టాలీవుడ్ రికార్డ్ ఎప్పటికీ చెరిగిపోదు. రేలంగి, బ్రహ్మానందం.. తెలుగు చిత్రసీమకు మూలస్థంబాలు లాంటోళ్లు. కామెడీ పదానికి గౌరవం తీసుకొచ్చిన వాళ్లలో వీళ్లు ఎప్పుడూ కూడా టాప్ లోనే ఉంటారు. ప్రస్తుతం బ్రహ్మానందం కెరీర్ అయిపోయిందనే చెప్పాలి. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమని ఏలిన ఆయన.. ప్రస్తుతం వయసురీత్యా పెద్దగా సినిమాలేం చేయట్లేదు. చేసిన ఒకటో రెండో మూవీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇలాంటి టైంలో బ్రహ్మానందం ఏ తెలుగు నటుడికి సాధ్యం కాని అరుదైన రికార్డు క్రియేట్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అలీ. డిఫరెంట్ స్లాంగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కడుపుబ్బా నవ్వించే అలీ.. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం అటు నటనతో పాటు వైసీపీ తరఫున ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారుగానూ ఉన్నారు. ఇప్పుడు ఆయన.. బ్రహ్మానందంతో పాటు తెలుగు నటీనటుల్లో సరికొత్త రికార్డ్ సాధించారు. అదేంటంటే… తొలిసారి నేపాలీ మూవీలో నటిస్తున్నారు. గతేడాది దీని గురించి ప్రకటన వచ్చినప్పటికీ ఎవరికీ పెద్దగా తెలియదు.
‘రస్వో దీర్ఘా’ టైటిల్ తో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. హీరోయిన్ నీతా దుంగన.. బ్రహ్మానందం, అలీతో తీసుకున్న ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే షూటింగ్ లో ఈ ఇద్దరూ కమెడియన్స్ గెటప్స్ లో ఉన్న పిక్స్ కూడా కొన్ని బయటకొచ్చాయి. ఇవి చూసిన నెటిజన్స్.. బ్రహ్మీ-అలీలను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా ట్రెండ్ వల్ల యాక్టర్స్ అందరూ పలు భాషల్లో నటిస్తున్నారు. కానీ పరాయి దేశంలో తీస్తున్న సినిమాలో నటిస్తుండేసరికి సరికొత్త రికార్డు నమోదైంది. మరి బ్రహ్మీ-అలీ.. నేపాలీ మూవీలో నటిస్తుండటంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.