దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా దాని జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ లో ట్రిపుల్ చేరుకుంటున్న శిఖరాలను అందుకోవడం మరే ఇతర ఇండియన్ సినిమాల వల్ల కాదేమో అనిపించుకుంటోంది. ఎందుకంటే.. హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖ దర్శకనిర్మాతలు ఎప్పుడూ ఇండియన్ సినిమాల గురించి ఇంతలా మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ పై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించాడు.
అనురాగ్ మాట్లాడుతూ.. “రాజమౌళి తీసిన RRR మరే ఇతర భారతీయ సినిమాలు అందుకోలేని స్థానాలకు చేరింది. వెస్ట్రన్ ఫోక్ లో ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పుడు ఇండియన్ జ్యూరీ RRR ఎంపిక చేసి పంపితే ఆస్కార్ నామినేషన్ కు 99% అవకాశం ఉంది. RRR చాలా పెద్ద సినిమా.హాలీవుడ్ వాళ్లంతా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోతున్నారు. నన్ను నమ్మండి, ఆర్‌ఆర్‌ఆర్ ను భారతదేశం ఎంచుకుంటే, ఆస్కార్ అవార్డ్స్ బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేట్ అయ్యే అవకాశం 99% ఉంది.
హాలీవుడ్ ప్రేక్షకులకు RRR ఒక పార్టీలా మారింది. అక్కడ పార్టీ ఉన్న ప్రతిసారీ, వాళ్ళు RRRని చూస్తున్నారు. అందులోనూ టైగర్ ఫైట్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ మరియు ముఖ్యంగా హీరోల డ్యాన్స్ బిట్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్లకు డ్యాన్స్ బిట్ పిచ్చిగా నచ్చేసింది. RRR ఒకదాని తర్వాత మరొక యాక్షన్ సీక్వెన్స్ కాంబినేషన్. ఇది ఇప్పటివరకు వారు చూసిన వాటికి భిన్నంగా ఉంది. యుఎస్ ప్రేక్షకుల దృష్టిలో SS రాజమౌళి ఒక స్టార్ ఫిల్మ్ మేకర్” అని చెప్పారు. మార్వెల్ చిత్రాల కంటే హాలీవుడ్ జనాలు RRR పై పిచ్చి పెంచుకున్నారు అని అనురాగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనురాగ్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ పై అనురాగ్ ప్రశంసల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#AnuragKashyap:
If #RRRMovie becomes India Selection 99% it might get Nomination for #Academy (Oscars) that is the impact RRR has had in the world of #Hollywood.
West: They have discovered a new film maker in #SSRajamouli
They find it better than any #Marvel movie.🥵🥵🥵 pic.twitter.com/0WSMbAl6DL— Roasters Hustle (@RoastersHustle) August 15, 2022