ఇటీవల సినీ తారలు పండంటి బిడ్డలకు జన్మనిస్తూ తల్లిగా మురిసిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ మద్యనే ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలీవుడ్ మోడల్, నటుడు కరణ్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బిపాసా ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. బిపాషా బసు తన బేబీ బంప్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ను పోస్ట్ చేస్తూ, గర్భధారణ సమయంలో బాడీ పాజిటివిటీ గురించి తన ఇన్ స్ట్రాగామ్ లో మాట్లాడింది. నవంబర్ 12 న పండంటి పాపకు జన్మనివ్వడంతో ఆనందంలో మునిగిపోయారు బిపాషా, కరణ్ దంపతులు.
కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా రాణించిన బిపాషా 2001 అజ్ నబీ చిత్రంతో నటిగా ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తర్వాత హరర్, శృంగారభరిత చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది బిపాషా. బాలీవుడ్ లోనే కాదు.. ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించింది. 2015లో వచ్చిన అలోన్ చిత్రంలో నటించిన తన సహనటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కొంతకాలం డేటింగ్ లో ఉండి 2016 పెళ్లి చేసుకున్నారు.
బిపాషా పాపకు జన్మనివ్వడంతో అభిమానులు ఎంతో సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల బిపాషా, కరణ్ సింగ్ తాము మొదటి బిడ్డ కోసం ఎంతో ఎదురచూస్తున్నాం.. అంటూ బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట థ్రిల్లరో జోనర్ లో వచ్చిన ‘డేంజరస్’ అనే వెబ్ సీరీస్ లో కూడా నటించారు.
Blessed 🙏🔱🧿 https://t.co/PHMO4I9t8j
— Bipasha Basu (@bipsluvurself) November 12, 2022