షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ స్టార్ గా అందరికి పరిచయం. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీతో మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన ఆటతీరుతో బిగ్ బాస్-5లో విజేత రేస్ లో ఉండి.. చివరకి రన్నరఫ్ గా నిలిచాడు. ఈ షో ద్వారా అనేక మంది అభిమానులను షణ్నూ సొంతం చేసుకున్నాడు. అయితే ఇదే షో..తన ప్రేమసి దీప్తి సునైనాతో విడిపోవడానికి కారమైనట్లు టాక్. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్మూఖ్ గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “ఏజెంట్ ఆనంద్ సంతోష్” అనే సిరీష్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా షణ్ముఖ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.
అంత సవ్యంగా జరుగుతున్న షణ్ముఖ్ జీవితంలో తాజాగా విషాదం నెలకొంది. అది ఏమిటంటే.. షణ్ముఖ్ ఎంతో ఇష్టమైన తన బామ్మ మరణించింది. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఈ స్టోరీకి రిప్ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ వీడియోలో తన పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా ‘ఏమో చూస్తానో లేదో..’ అని బామ్మ అన్నట్లుగా ఉంది. ‘నువ్వు ఉండాలి’ అని షణ్ము అనగా, ‘నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుంది’ అని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. ఇలా బామ్మతో షణ్ముకు ఉన్న అటాచ్‌మెంట్ చూసి నెజిన్లు ఎమోషనల్ అవుతున్నారు.
ఇదీ చదవండి: చీరకట్టులో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత..!