సిల్క్ స్మిత.. 80, 90 దశకాల్లో కుర్రకారు కలల యువరాణిగా నీరాజనాలు అందుకుంది. ఆ కాలంలో శృంగార తారగా వెలుగొందిన సిల్క్.. ఏ స్టార్ హీరోయిన్ కు లేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అంతలా ఆదరణ పొందిన సిల్క్ తక్కువ వయసులోనే ప్రాణాలు కొల్పోవడం బాధాకరం. ఇక నాని దసరా మూవీలో సైతం సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని కనిపించి హల్ చల్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సోయగం దివి సిల్క్ స్మిత లా చీరకట్టు కట్టి.. కుర్రాలకు వలపు బాణాలు విసురుతోంది. సిల్క్ స్మిత కు నేను ఎప్పటికీ అభిమానినే అని క్యాప్షన్ సైతం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
దివి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ప్రజలందరికి సుపరిచితురాలే. ఇక ఈ అమ్మడు కళ్లకు మెగాస్టార్ చిరంజీవి సైతం పడిపోయారు. ఆ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పారు. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు దివి. తాజాగా 80, 90 దశకాల్లో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది నీలి కళ్ల తార సిల్క్ స్మిత. మళ్లీ అలాంటి చూపులతో, అలాంటి చీరకట్టుతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది బిగ్ బాస్ సోయగం దివి పాప. అచ్చం సిల్క్ స్మితలానే కైపెక్కించే చూపులతో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే సిల్క్ స్మితకు ఏ మాత్రం తీసిపోని అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇక తానెప్పుడు సిల్క్ స్మితకు అభిమానినే అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సిల్క్ ను మించిపోయేలా తన చూపుల బాణాలు విసురుతు యువకులకు మనసుకు గాయాలు చేస్తోంది ఈ దివి ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దివి ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటుగా కొన్ని సినిమాల్లో సైతం నటిస్తూ.. బిజీగా ఉంది. మరి సిల్క్ స్మితను గుర్తుకు తెచ్చిన దివి మత్తెక్కించే అందాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.