బుల్లితెర సక్సెస్ ఫుల్ రన్నింగ్ బిగ్‌బాస్ సీజన్ 5 సందడి అప్పుడే మొదలైపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూడగానే అందరికీ గూస్ బమ్స్ రావాల్సిందే. తొలివారం నామినేషన్ ప్రక్రియతో హౌజ్ లో అసలు ఆట మొదలైపోయింది. మిత్రులు ఎవరు? ఎవరి అభిప్రాయాలు ఏంటి? వారి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అన్నది ప్రేక్షకులు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడూ హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రస్టింగ్ గా ప్లాన్ చేస్తారు. ఈసారి ఒక్కో కంటెస్టు ఫొటోతో 19 చెత్త కవర్లను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఒక్కొక్కరు వెళ్లి రీజన్ చెప్పి వారు నామినేట్ చేసే వ్యక్తి ఫొటో ఉన్న ట్రాష్ బ్యాగ్ ని బిగ్ బాస్ హౌజ్ ట్రాష్ బిన్ లో వేయాలి. ఇక, ఎవరు ఎవరిని నామినేట్ చేశారు.. కారణం ఏం చెప్పారో చూద్దాం.
లోబోతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. లోబో అంటే సందడే కదా. ఉమాదేవి బ్యాగ్ తీసి పడేయటం, షణ్ముఖ్ ని 20 ఏళ్ల చిన్నపోరగాడు అంటూ మజాక్ చేస్తాడు. ఒక్కసారి యాంకర్ రవి బ్యాగ్ తీసి నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అంటూ సీరియస్ అయిపోయాడు. అంటే ఈ వారం అసలు కథ ఇద్దరు స్టార్ యాంకర్ల మధ్యనే ప్రధానంగా నడవబోతోందని అర్థమైపోతోంది.
బుల్లితెర హీరో, విలన్ యాక్టర్ విశ్వ, మోడల్ జెస్సీల మధ్య ఏదో జరిగింది. నిప్పు గట్టిగానే రాజుకుందని చెప్పాలి. విశ్వ జెస్సీనీ నామినేట్ చేస్తూ ఓ సందర్భాన్ని ప్రస్తావిస్తుండగా జెస్సీ కలగజేసుకుంటాడు. ‘నన్ను చెప్పనివ్వు.. నాతో ఆ టోన్ మాట్లాడకు’ అంటూ విశ్వ చాలా సీరియస్ అవుతాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా మోడల్ జెస్సీనే నామినేట్ చేస్తూ బుడ్డోడా ఇలా ఉన్నావంటే తొక్కేస్తారంటూ సూచిస్తాడు. భావోద్వేగంతో జెస్సీ కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి జెస్సీ చాలా సైలంట్ గా అందరితో కలివిడిగా ఉన్నాడు. మరి, విశ్వాకి ఎందుకు అంత కోపం వచ్చింది అన్నది ప్రశ్నార్థకమే అవుతుంది. జెస్సీ కన్నీరు పెట్టుకోవడంతో హౌజ్ మేట్స్ ఒకింత నిరుత్సాహంగా కనిపించారు.
కుర్రకారుకు ఎంతో నచ్చే వెబ్ సిరీస్ క్వీన్, బోల్డ్ బ్యూటీ సరయూ ఎందుకు ఆర్జే కాజల్‌ని నామినేట్ చేసింది. ‘యు డిసర్వ్ ఇట్’ అంటూ చాలా సీరియస్‌గానే చెప్పింది. మరి, వారి మధ్య మొదలైన ఆ లడాయి ఏదైనా ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చేది అయి ఉంటది. రవి విషయానికి వస్తే ఉన్నవారిలో కాస్త సీనియర్.. డ్యాన్స్ మాస్టర్ నటరాజ్‌ను నామినేట్ చేశాడు. మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారని యాంకర్ రవి చెప్పిన కారణానికి నటరాజ్ మాస్టర్ కాస్త సీరయస్ గానే కౌంటర్ ఇచ్చారు. నేనిలాగే ఉంటాను, నాకు నటించడం రాదు అని. సన్నీ, షణ్ముఖ్ ల మధ్య నిప్పు అంటుకుందనే చెప్పాలి. ఇక్కడికొచ్చాక ప్రతి ఒక్కరికీ ఒక సైన్యం వస్తుందన్న సన్నీ మాటకు షణ్ముఖ్ రిప్లై చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోంది. కానీ, సన్నీ ఎందుకు షణ్ముఖ్ ని నామినేట్ చేశాడు అన్న విషయం కోసం కచ్చితంగా ఎపిసోడ్ చూడాల్సిందే.
అసలు జెస్సీ ఎందుకు టార్గెట్ అయ్యాడు? లోబో దగ్గర రవి ఏం యాటిట్యూడ్ ప్రద్శించాడు. మన బోల్డ్ బ్యూటీకి ఆర్జే కాజల్ పై ఎందుకంత కోపం? సన్నీ- షణ్ముఖ్ వివాదం మాటల వరకేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.