తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్‌గా కెరీర్ ఆరంభించి తర్వాత నిర్మాతగా తనదైన సత్తా చాటిన బండ్ల గణేష్.. రాజకీయాల్లో తనదైన మార్క్ మాత్రం చాటుకోలేకపోయారు. ఆ మద్య కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన మళ్లీ నటుడిగా తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు హీరో అవతారం ఎత్తాడు.
‘డేగల బాబ్జీసగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బండ్ల. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. ఇటీవల మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇది ఆసక్తిని పెంచింది. సమాజంలోని అంశాల గురించి ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఇక సినిమా ఫంక్షన్స్ లో ఆయన ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బండ్ల గణేష్ నిమాలతోనే కాదు సేవా కార్యక్రమాలతోను అందరి మనసులు గెలుచుకుంటారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తన వంతు సాయం అందించాడు.
తాజాగా నేపాలీ పాపను తాను పెంచుకుంటున్నట్టు తెలిపాడు బండ్ల. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఓ రోజు పాప ఏడుస్తుంటే.. వాళ్ల అమ్మ దగ్గర ఏమీ లేక కేవలం పాలు మాత్రమే పట్టేదట. ఆ తల్లి బాధ చూసి నా భార్య పాపను మనం పెంచుకుందాం అని చెప్పిందట. అంతే అప్పటి నుంచి ఈ చిన్నారి మా ఇంట్లో సందడి చేయడం మొదలు పెట్టిందని అన్నారు. అందరూ కుక్కలు, పిల్లులు అని పెంచుకుంటారు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు. కానీ నేను ఇలా పాపని పెంచుకొని, ఆ పాప బాధ్యత తీసుకొని గొప్పగా చదివించాలని అనుకుంటున్నానని బండ్ల తెలిపారు. ఇంట్లో నా కుమారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్లింది ఈ చిన్నారి అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.