సాధారణంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ట్రోల్స్ కారణంగా సెలబ్రిటీలు అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ట్రోల్స్, మీమ్స్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. అలియాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. తనపై వస్తున్న ట్రోల్స్ నే ఆయుధంగా మలుచుకున్నాడు ఈ యంగ్ యాక్టర్. ఓ నటుడు పదేళ్లు కష్టపడినా గానీ, రాని గుర్తింపు చంద్రహాస్ కు ఒక్క రాత్రిలోనే వచ్చింది. యాటిట్యూడ్ స్టార్ గా ఓవర్ నైట్ లోనే స్టార్ గా ఎదిగాడు చంద్రహాస్. అయితే తనపై వచ్చిన, వస్తున్న ట్రోల్స్ పై తాజాగా స్పందించాడు చంద్రహాస్.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. ఇప్పుడు ఈ పేరు తెలియని కామన్ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే ఓ చిన్నపాటి హీరోకి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చంద్రహాస్ కు వచ్చింది. ఇక తనపై వచ్చిన ట్రోల్స్ కు తన ఫ్యామిలీ ఎంతో బాధ పడిందని, కానీ నేను అవన్ని లైట్ తీసుకున్నానని చంద్రహాస్ తెలిపాడు. మా అమ్మకు సైతం బాధపడొద్దని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. ఇక తాజాగా ఓ స్పెషల్ షోలో తన తండ్రితో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు చంద్రహాస్. మాస్ స్టెప్పులతో తనలోని నటుడిని మరోసారి బయటకు తీశాడు. ఇక ఈ షోలో కూడా తనదైన యాటిట్యూడ్ చూపించాడు చంద్రహాస్.
ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని ఇంత దారుణంగా ట్రోల్ చేశారు కదా మీకు బాధ కలగలేదా? అని ప్రశ్నించగా.. సమాధానం ఇస్తూ..” నేను ఆ రోజు కావాలని అలా చేసింది కాదు. ఆ ప్రెస్ మీట్ లో దాదాపు 30 కెమెరాలు ఉన్నాయి. పైగా మా నాన్న నన్ను పొగుడుతుంటే.. నాకు నవ్వు వస్తోంది. దాంతో నేను అక్కడ నవ్వు ఆపుకోడానికి ట్రై చేశాను. అది చూసే వారికి యాటిట్యూడ్ లాగా కనిపించింది. మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల అలా అయ్యింది” అని తనపై ట్రోల్స్ కు సమాధనం చెప్పాడు చంద్రహాస్. అయితే ఈ ట్రోల్స్ గురించి మా అమ్మ చాలా ఫీల్ అయ్యింది. నేను మాత్రం లైట్ తీసుకోమని చెప్పాను అని చంద్రహాస్ తెలిపాడు.
ఇక తన కొడుకుపై వచ్చిన ట్రోల్స్ పై గతంలో స్పందించిన ప్రభాకర్ మరోసారి మాట్లాడాడు. ట్రోల్స్ గురించి మెుదట్లో నేను బాధపడ్డాను.. వాడు ఫీల్ అవుతాడో ఏమో అని. కానీ వాడు ట్రోల్స్ ను చాలా స్పోర్టీవ్ గా చూసుకున్నాడు. ఇక ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ.. బాధపడితే ప్రయోజనం ఉండదని ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. మరి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పై వచ్చిన ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.