వెండితెరపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క కాంబినేషన్ అంటే స్పెషల్ అనే చెప్పాలి. ఈ జంటకు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక సగటు అభిమానులు కూడా ఈ జంటను చూసి ముచ్చటపడిపోతుంటారు. మళ్లీ ఈ జంట కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని దక్షిణాది అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్నారనే పుకార్లు సైతం చాలానే వచ్చాయి.
ఇది కూడా చదవండి: RRR మేనియా: మూడోరోజూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పంట!
అయితే తాజాగా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా అనుష్క నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తపై గతంలో కూడా వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ ను డైరెక్టర్ మారుతి మారోసారి రిపీట్ చేయున్నారని తెలుస్తోంది. ఇక ఈ వార్త విన్న ప్రభాస్, అనుష్క అభిమానులు ఆనందంతో ఉబ్బిపోతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారి ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. మరి నిజంగానే ప్రభాస్ సరసన అనుష్క మరోసారి జతకట్టనుందా అనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.