తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు అందచందాలతో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు మన తెలుగు యాంకర్స్. వీరిలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది వర్షిణి. ఢీ షో ద్వారా ఈ అందాల ముద్దుగుమ్మ యాంకర్ గా పాపులర్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత అడపదడప షోలు చేస్తూనే జబర్దస్త్ లోనూ మెరిసింది. ఇక ఇందులో యాంకర్ రష్మితో పోటీ పడి మరీ తన సత్తాను చాటుకుంది. కాగా ఢీలో హైపర్ ఆదికి జోడిగా కనిపిస్తూ తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
అయితే ఆ తర్వాత అక్కడ నుంచి తప్పకుని స్టార్ మాలో యాంకర్ గా కనిపించింది వర్షిణి. ఇక అసలు విషయం ఏంటంటే?.. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న యాంకర్ వర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. తను సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, చాలా కష్టాలు పడ్డానని తెలిపింది. నేను మోడలింగ్ చేసే సమయంలో అనేక అవకాశాలు వచ్చాయని, అందులో వచ్చిన మంచి అవకాశాలు చేజిక్కించుకుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని వర్షిణి తెలిపింది.ఇక దీంతో పాటు నేను మోడలింగ్ చేసే సమయంలో ఓ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సినిమా అవకాశం ఇస్తానని ఓ రోజు ఇంటికి రమ్మన్నాడు. నిజమేనని వెళ్తే నాతో అసభ్యకరంగా ప్రవర్తించి నా చేయి పట్టి బెడ్ మీదకు లాగే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే ప్రతిఘటించిన నేను అతని చెంప మీద లాగి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయానని యాంకర్ వర్షిణి ఏమోషనల్ అయింది. తాజాగా చేసిన వర్షిణి కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వర్షిణి చేసిన తాజా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.