యాంకర్ ఉదయభాను.. ఈ పేరు తెలియని సగటు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తికాదు. గత కొన్నేళ్ల కిందట బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. ఉదయభాను కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇలా వరుస అవకాశాలతో జోరు మీదున్న సమయంలో యాంకర్ ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయని ఉదయభాను కొంత కాలం పాటు విరామం తీసుకుని పిల్లల ఆలనా, పాలన చూసుకుంది.
అయితే చాలా ఏళ్ల తర్వాత ఈ డైనమిక్ యాంకర్ మళ్లీ యాంకర్ గా రీ ఎంట్రీ ఇస్తూ ఈవెంట్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తుంది. అయితే బుధవారం నిర్వహించిన చోర్ బజార్ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ కు ఉదయభాను యాంకర్ గా వ్యవహిరించారు. కాగా ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేశారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక విశ్వక్ సేన్ స్టేజ్ పైకి పిలుస్తూ ఉదయభాను కొన్ని పంచులు విసిరింది. దీనికి ఎక్కడ కూడా తగ్గకుండా విశ్వక్ సైతం తనదైన స్టైల్లో పంచులతో ఎదురుదాడికి దిగాడు. ఇక మొదటగా ఉదయభాను విశ్వక్ ను పిలిచిన తర్వాత.. సినిమాల్లో కన్న రియల్ గా చాలా బాగున్నవ్ అని పొగిడింది.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: కొడుకు సినిమా ఫంక్షన్ కు రాని పూరీ! బండ్ల గణేష్ కోపానికి కారణం?
దీంతో వెంటనే స్పందించిన విశ్వక్ మిమ్మల్నీ చూస్తూ పెరిగానంటూ పంచ్ వేశాడు. మిమ్మల్నీ చూడక చాలా రోజులు అయింది. ఉదయభానును పిలిచి నందుకు థాంక్యూ. చిన్నప్పుడు మిమ్మల్ని చూద్దామని అనుకునేవాడిని అంటూ విశ్వక్ సేన్ ఉదయభానును సైతం పొగిడాడు. వెంటనే ఉదయభాను రియాక్ట్ అయి.. నేను కూడా చాలా రోజులు అయింది. మిమ్మల్ని చూడాలి, చూడాలి అని అనుకున్నాను అంటూ మళ్లీ పంచ్ వేసింది. అప్పుడు విశ్వక్ స్పందించి.. మీ చిన్నప్పడు నేను ఇంకా పుట్టలేదంటూ రివర్స్ పంచ్ వేశాడు. ఇలా ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకోవడంతో ఈ వెంట్ కు వచ్చిన అందరికీ కాస్త ఎంటర్ టైన్ మెంట్ దొరికినట్లైంది. ఉదయభాను విశ్వక్ సేన్ పై వేసిన పంచులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.