ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ జోడి పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలియదు కాని.. వాళ్ళు జబర్దస్త్ లో కలిసినా, మాట్లాడినా, వాళ్ళిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా అది సంచలనమే అవుతుంది. ఇక చాన్నాళ్లుగా రష్మీ, సుధీర్ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ ఖండిస్తూ వస్తున్నారు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు సుధీర్, రష్మీ ల పెళ్లి గురించి ఓ టాపిక్ వచ్చింది. దీనికి రష్మీ ఎప్పటిలాగే తనదైన శైలిలో సమాధానం చెప్పింది.సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న నాకు కొత్త కాదని అంది. నా పెళ్లి గురించే నేను ఆలోచించడం లేదు.. ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టిపెడుతున్నాను అని చెప్పుకొచ్చింది రష్మీ. అంతే కాదు పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంది. చాలా విషయాల గురించి 2020లో ప్లాన్ చేసుకొంటే ఏం జరిగిందో అందరికి తెలిసిందేనని వ్యాఖ్యానించింది. 2021లో కూడా ఎలాంటి ప్లాన్స్ చేసుకోదలచుకోలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచన కూడా రావడం లేదు అని రష్మీ గౌతమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రష్మీ నటిస్తున్న బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. కానీ కరోనావైరస్ పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతోంది రష్మీ.