యాంకర్ అనసూయ.. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాల్లో సైతం స్టార్స్ పక్కన నటిస్తోంది. యాంకర్ గా ఎంత పెద్ద సక్సెస్ అయిందో నటిగా కూడా అంతే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే అనసూయ డ్రెసింగ్ పై అప్పుడప్పుడు నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికీ చాలా మంది కామెంట్ చేయడం వారికి అనసూయ గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఫ్యాన్స్‌ను సడెన్ సర్‌ప్రైజ్ చేసిన రామ్‌చరణ్..
అయితే తాజాగా కూడా ఓ నెటిజన్ అనసూయ డ్రెసింగ్ పై కామెంట్ చేస్తూ.. అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావంటూ కామెంట్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన అనసూయ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్లు నెట్టింట్లో కాస్త చర్చనీయాంశమవుతోంది. అనసూయ డ్రెసింగ్ పై కామెంట్ చేసిన నెటిజన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.