ఈమె గురించి తెలుగు ప్రేక్షకులు చాలా అంటే చాలా బాగా తెలుసు. ఈమె అందాన్ని ఎప్పటికప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటారు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
ఇండస్ట్రీలో వివాదాలు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు ఏదో విషయమై గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయంలో నటీనటులు వీలైనంత వరకు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కొందరు మాత్రం ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ఈ బ్యూటీ కూడా ఆల్మోస్ట్ అదే టైపు. తెలిసి చేస్తుందా లేదా అనుకోకుండా జరుగుతుందో తెలియదు గానీ అందరూ తన గురించి మట్లాడుకునేలా చేస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో అందగత్తెలకు కొదవ లేదు. అలాంటివారిలో ఈ బ్యూటీ కచ్చితంగా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ లో అనామక రోల్స్ ఒకటి రెండు చేసింది గానీ గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ‘జబర్దస్త్’ యాంకర్ గా అడుగుపెట్టిందో ఈమె ఫేట్ మారిపోయింది. చెప్పాలంటే దెబ్బకు దశ తిరిగిపోయింది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అనసూయ. తాజాగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు(మే 15). ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పటి ఫొటో వైరల్ అయింది. మనం మాట్లాడుకునేలా చేసింది.
న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది. ఇద్దరబ్బాయిలకు తల్లి కూడా అయింది. పిల్లలు ఉంటే గ్లామర్ ఫీల్డ్ కి ఏ మాత్రం అడ్డుకాదని ప్రూవ్ చేసింది. ‘జబర్దస్త్’లో యాంకర్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మైండ్ పోయే రోల్ లో నటించి వావ్ అనిపించింది. ‘పుష్ప’లోనూ దాక్షాయణిగా శెభాష్ అనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. ‘జబర్దస్త్’తో పాటు టీవీషోలకు ఎప్పుడో టాటా చెప్పేసింది. అందరికీ వయసు పెరిగితే అందం, క్రేజ్ తగ్గుతాయి. ఈమెకి మాత్రం అవి ఎప్పటికప్పుడు డబుల్ అవుతున్నాయనే చెప్పాలి. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.