ఫిల్మ్ సిటీలో స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ చిన్న పనిమీద బయటకెళ్లిన అతడి మేకప్ మ్యాన్ పై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
సినిమా షూటింగ్స్ చాలావరకు ఫిల్మ్ సిటీలోనే జరుగుతూ ఉంటాయి. అక్కడైతే ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు. ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే షూటింగ్ స్పాట్ లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ వచ్చి వెళ్లి దారి మాత్రం కాస్త నిర్మానుష్యంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఫిల్మ్ సిటీలో ఓ ప్రమాదం జరిగింది. స్టార్ హీరో మేకప్ మేన్ పై చిరుత దాడి చేసింది. గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా సీఎం వరకు వెళ్లింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యవహీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న మూవీ ‘బడే మియా ఛోటే మియా’. ఈ సినిమా షూటింగ్ ముంబయిలోనే ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మేకప్ ఆర్టిస్ట్ గా శ్రవణ్ విశ్వకర్మ పనిచేస్తున్నాడు. అతడి ఫ్రెండ్ ఒకడు షూటింగ్ కు వచ్చాడు. దీని తర్వాత అతడిని దగ్గర్లో ఓ ప్లేసులో డ్రాప్ చేసేందుకు శ్రవణ్ వెళ్లాడు. తిరిగొస్తుండగా దారిలో రోడ్డుకు అడ్డంగా పంది వచ్చింది. దీంతో శ్రవణ్ బండి స్పీడ్ పెంచాడు. పంది వెనక వచ్చిన చిరుతను ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతడిపై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం శ్రవణ్.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇక శ్రవణ్ చికిత్సకు అయ్యేంత ఖర్చుని.. మూవీ నిర్మాతలు భరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ ప్రెసిడెంట్ స్పందించారు. ఇలాంటివి ముంబయి ఫిల్మ్ సిటీలో చాలానే జరిగాయని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. వందల ఎకరాల్లో నిర్మించిన ఫిల్మ్ సిటీలో రాత్రిపూట కనీసం స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదని, చిరుతలు పదేపదే రోడ్లపైకి వస్తున్నాయని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రెసిడెంట్ సురేష్ చెప్పుకొచ్చారు. చిరుతల నుంచి కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మరి స్టార్ హీరో అక్షయ్ కుమార్ మేకప్ మ్యాన్ పై చిరుత దాడి చేయడం గురించి మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.