తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ.., తన అభిమానంతో హీరోనే డామినేషన్ చేసిన ఫ్యాన్ ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇన్నాళ్ల తెలుగు సినీ చరిత్రలో అలాంటి అభిమాని ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే అక్కినేని అఖిల్ ని అయ్యగారిగా మార్చేసిన అఖిల్ అభిమాని.అక్కినేని అఖిల్ కూడా తన సూపర్ ఫ్యాన్ గురించి స్పందించాడు.
“బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నాకు పెట్టిన అయ్యగారు అనే పేరు నా జీవితంలో భాగం అయిపోయింది. అంతా ముందు ఆ పేరుతో నన్ను ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఆ మాటనే గొప్పగా పిలుస్తున్నారు. మిమ్మల్ని తప్పక కలుస్తాను బ్రదర్ . మీరు బాగుండాలి” అంటూ అఖిల్ తన ఫ్యాన్ గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అసలు అఖిల్ ఆ అభిమానిని నిజంగా కలుస్తాడా? లేదా? అన్న చర్చ అయితే సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతూ వచ్చింది. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ అఖిల్ తన సూపర్ ఫ్యాన్ ని కలిశాడట. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖిల్ పిలుపుతో హైదరాబాద్ వచ్చిన అయ్యగారు అభిమాని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ షూ, జీన్స్ తో అయ్యగారు ఫ్యాన్ ఓ రేంజ్ లో ఫోటోకి ఫోజ్ ఇవ్వడం విశేషం. అయితే.., అయ్యగారు, ఆయన అభిమాని కలసి దిగిన ఫోటో మాత్రం బయటకి రాలేదు. కేవలం అయ్యగారి అభిమాని ట్రెండీ లుక్ మాత్రమే బయటకి రావడంతో సోషల్ మీడియా పేజెస్ అఖిల్ తన అభిమానిని కలిసినట్టు చెప్తున్నాయి. మరి.., అయ్యగారు అభిమాని ఫ్యాన్ మూమెంట్ ఎలా గడించింది, అఖిల్ తన సూపర్ ఫ్యాన్ కి ఏమి సహాయం చేశాడు అన్న వివరాలు తెలియాల్సి ఉంది.