థియేటర్లలో ఆడుతున్న 'ఏజెంట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మరీ ఇంత త్వరగా అనౌన్స్ మెంట్ రావడంపై మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం తెగ బాధపడుతున్నారు.
అఖిల్ ‘ఏజెంట్’.. థియేటర్లలోకి వచ్చి ఐదు రోజులు కూడా పూర్తవలేదు. అప్పుడే ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా
ప్రకటించారు. అవును మీరు విన్నది. సినిమా రిలీజ్ కు ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని అందుకోవడంలో ‘ఏజెంట్’ ఘోరంగా అంటే ఘోరంగా ఫెయిలైంది. ఎంతలా అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో పడగానే ఫ్లాప్ టాక్ బయటకొచ్చేసింది. దీంతో ప్రేక్షకులు ఆ వైపే చూడటం మానేశారు. వీకెండ్ పూర్తయ్యేసరికి అసలు ఈ సినిమా ఒకటి రిలీజైందని డిస్కస్ చేసుకోవడమే మానేశారు. దీంతో ఓటీటీ పార్ట్ నర్ అయిన సోనీ లివ్ కూడా అలెర్ట్ అయిపోయింది. ఇంకెందుకు లేటు అన్నట్లు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్కినేని అఖిల్ హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. 2015లో ‘అఖిల్’ మూవీతో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. ఆ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడు కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు పూర్తిగా నిరాశ చెందారు. అప్పటి నుంచి మొదలుపెడితే.. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సేమ్ రిజల్ట్ అందుకున్నాయి. 2021లో వచ్చిన ‘మిస్టర్ బ్యాచ్ లర్’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘ఏజెంట్’ అయితే అఖిల్ కెరీర్ నే ప్రశ్నార్థకంగా మార్చేసింది.
సినిమా టాక్ ఏంటనేది పక్కనబెడితే.. ‘ఏజెంట్’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్ థియేటర్లలోకి వచ్చిన 22 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అందుకు తగ్గట్లే మే 19 నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందని ఏకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఓవైపు మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నప్పటికీ.. థియేటర్ కి వెళ్లి చూసినవాళ్లు మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలా వచ్చేస్తుందని తెలిస్తే అసలు వెళ్లేవాళ్లం కాదు కదా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ‘ఏజెంట్’ మూవీ ఓటీటీలోకి త్వరగా వచ్చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#Agent OTT release (Sony LIV) from May 19 🫵🏻 pic.twitter.com/UNhY0vzitv
— Keshav (@Keshav4005) May 2, 2023